ఇటీవల కాలంలో చిన్న వయసులోనే ముఖంపై ముడతలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న పని ఒత్తిడి, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల ఈ సమస్య ఎదురవుతుందని నిపుణులు చెబుతున్నారు. చర్మంపై ముడతలని తగ్గించాలంటే పోషకాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. విటమిన్ A, C, E, K.. మెగ్నీషియం, ఐరన్ ఎక్కువగా ఉండే పాలకూరను తినాలి. అవకాడో, పప్పుధాన్యాలని ఆహారంలో భాగం చేసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. ఇలా చేస్తే మృతకణాలు తొలగి.. మచ్చలు తగ్గుతాయి.