‘క’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కొత్త దర్శకుడు యుడ్లీతో ఆయన ఓ సినిమా చేస్తున్నారు. ‘కే10’ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాకు ‘దిల్ రుబా’ అనే పేరు ఫిక్స్ చేశారట. ఇక ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్ సమర్పణలో ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ సంస్థ నిర్మిస్తోంది.