KDP: సీఎం చంద్రబాబు నాయుడును కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పేర్కొన్నారు. ప్రొద్దుటూరు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించాలని కోరినట్లు వెల్లడించారు. రహదారులను విస్తరణ చేసేందుకు తగిన సహాయ, సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.