TG: లావణ్య ఇంటి ముందు నటుడు రాజ్‌తరుణ్ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. లావణ్య ఉంటున్న ఇల్లు రాజ్‌తరుణ్‌ది అని.. తన కొడుకు కష్టపడి కట్టుకున్న ఇల్లు అని అన్నారు. లావణ్య తమ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపించారు. సొంత ఇల్లు ఉండి తాము బయట ఎందుకు ఉండాలని నిలదీశారు. తాము నడవలేని స్థితిలో ఉన్నామని.. తమ ఇల్లు తమకు కావాలని కోరుతున్నారు.