BDK: దమ్మపేట మండల పరిసర ప్రాంతాలలోని గిరిజన భూముల్లో పెద్ద ఎత్తున జీడిమామిడి పంటను రైతులు సాగు చేస్తున్నారు. అయితే, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవటంతో.. ఇదే అదునుగా భావించిన ఆంధ్రా దళారులు.. ఎలాంటి సెజ్ కట్టకుండానే లారీల కొద్ది జీడి పంటను సరిహద్దులు దాటిస్తూ కోట్లు దండుకుంటున్నారు అని రైతులు ఆరోపిస్తున్నారు.