CTR: రామకుప్పం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులను పరామర్శించి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు సరిపడా మందులు ఉన్నాయా లేవా అని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆసుపత్రికి ఏమయిన అవసరం ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు.