WGL: కాంగ్రెస్ మేనిఫెస్టోలోని హామీ ప్రకారం స్థానిక సంస్థల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఎన్పీఅర్డీ ఇండియా జాతీయ అధ్యక్షులు తుడుం రాజేందర్ డిమాండ్ చేశారు. బుధవారం వరంగల్ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర అధ్యక్షులు దైనంపల్లి మల్లికార్జున్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు.