వాహన పరిశ్రమలో ధరలు పెంపు ధోరణి కొనసాగుతోంది. ఇప్పటికే కీలక కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. తాజాగా స్కోడా ఆటో ఇండియా సైతం ధరలు పెంచాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు 2025 జనవరి నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. స్కొడాలో ఉన్న అన్ని మోడళ్ల ధరలను 3 శాతం మేర పెంచనున్నట్లు స్పష్టం చేసింది.