AP: మాజీమంత్రి కాకాణి తనపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. కాకాణి గోవర్ధన్రెడ్డిది కాకిగోల అని విమర్శించారు. నిద్రపట్టక పిచ్చి కూతలు కూస్తున్నారని ఎద్దేవా చేశారు. కాకాణి మంత్రిగా సంపాదించిన అక్రమ సంపాదనను తాను బయటపెట్టానని అన్నారు. మొదటి నుంచి నిరాధార ఆరోపణలు చేయడం ఆయనకు పరిపాటిగా మారిందని సోమిరెడ్డి మండిపడ్డారు.