»Nokia Phone Again In The Indian Market Model C99 Price Features
Nokia C99: దేశీయ మార్కెట్లోకి మళ్లీ నోకియా ఫోన్.. C99 ధర, ఫీచర్లు!
నోకియా కంపెనీ ఇండియా(indian market)లో "మ్యాజిక్ బాక్స్"గా పిలువబడే సరికొత్త Nokia C99 స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇది 6.7 అంగుళాల LTPO AMOLED స్క్రీన్, క్వాల్కామ్ హై-ఎండ్ SoC, స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 వంటి ఫీచర్లు దీనికి ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ స్మార్ట్‌ఫోన్ 144 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 180W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుందని తెలిసింది.
స్మార్ట్‌ఫోన్ మార్కెట్(smart phone)లో తన అడుగులు వేయడానికి నోకియా నెమ్మదిగా మళ్లీ ప్రయత్నిస్తోంది. దాని లోగో మార్పుతోపాటు నోకియా స్మార్ట్‌ఫోన్‌లో ప్రవేశం చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బార్సిలోనాలో ఇటీవల జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC 2023) సందర్భంగా కంపెనీ తన రాబోయే Nokia Magic X, Nokia C99 ఫోన్ మోడళ్లను ప్రకటించింది. అయితే వీటిలో నోకియా C99 మోడల్ ఫోన్ ను భారతదేశంలో నవంబర్ 18, 2023న ప్రవేశపెట్టినున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు(features), దీని ధర(price) ఎంత వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది 120 GHz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల పూర్తి HD AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్‌తో వస్తున్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌లో పని చేస్తుంది. సరికొత్త Qualcomm Snapdragon 8 Gen 2, 5G ప్రాసెసర్ చిప్‌సెట్‌ను ఈ ఫోన్లో చూడవచ్చు. స్మార్ట్‌ఫోన్(smart phone)లో వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 144 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 64MP+48MP కెమెరా సెన్సార్ అందుబాటులో ఉంటుంది. ఇది 7950mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీని పొందవచ్చు. ఇది 180W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది. కొన్ని నిమిషాల్లోనే ఈ(Nokia C99) ఫోన్‌ను 100 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.
ఈ ఫోన్ ధర 8GB/12GB/16GB RAM, 256GB/512GB ఇంటర్నల్ స్టోరేజ్, RAMతో విభిన్న వేరియంట్లను చూడవచ్చు. ఫోన్ వేరియంట్ ఆధారంగా ధర కూడా నిర్ణయించబడుతుంది. ఇండియన్ మార్కెట్లో(indian market) దీని ధర సుమారు రూ.44,900 ఉండవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు.