Motorola Razr+ flip మొబైల్ ఫీచర్స్ లీక్.. పేరు, మోడల్ ఇదే!
Motorola Razr+ flip:మోటోరోలా రేజర్ 2022కు అడ్వాన్స్డ్గా మోటోరాలా రేజర్ ప్లస్ ఫ్లిప్ మోడల్ (Motorola Razr+ flip) తీసుకొచ్చింది. దీనిని ‘మై స్మార్ట్ ప్రైస్’ (my smart price) రివీల్ చేసింది. కంపెనీ మాత్రం అధికార ప్రకటన చేయలేదు. సో.. మోటోరోలా ఫ్లిప్ మోడల్, పేరు ఆన్లైన్లో లీకయ్యాయి.
Motorola Razr+ flip:ఇప్పుడు ఫ్లిప్ మొబైల్ టైమ్ వచ్చేసింది. అన్నీ మొబైల్ కంపెనీలు ఫ్లిప్ (Flip) మోడల్స్ తీసుకొస్తున్నాయి. మేమేం తక్కువనా అంటూ.. మోటోరోలా (Motorola) కూడా ముందుకు వచ్చింది. మోటోరోలా రేజర్ 2022కు అడ్వాన్స్డ్గా మోటోరాలా రేజర్ ప్లస్ ఫ్లిప్ మోడల్ (Motorola Razr+ flip) తీసుకొచ్చింది. దీనిని ‘మై స్మార్ట్ ప్రైస్’ (my smart price) రివీల్ చేసింది. కంపెనీ మాత్రం అధికార ప్రకటన చేయలేదు. సో.. మోటోరోలా ఫ్లిప్ మోడల్, పేరు ఆన్లైన్లో లీకయ్యాయి.
మోటోరోలా రేజర్ ప్లస్ మొబైల్ పేరు మోటోరోలా రేజర్ ప్లస్ (Motorola Razr+) మోనికర్ అని.. ఆ మొబైల్ మోడల్ నంబర్ XT2321 ఇస్తారట. 2.7 ఇంచుల కవర్ డిస్ ప్లే, 2850 బ్యాటరీ సామర్థ్యం ఉంటుందట. గతేడాది ఆగస్టులో మోటోరోలా రేజర్ (Motorola Razr) 2022 మొబైల్ చైనాలో విడుదలయిన సంగతి తెలిసిందే. ఆ మొబైల్‌కు అడ్వాన్స్ వెర్షన్ ఇదీ అని ‘మై స్మార్ట్ ప్రైస్’ (my smart price) చెప్పింది.
రేజర్ పేరుకు బదులుగా రేజర్ ప్లస్ మోనిక్.. మోటోరోలా రేజర్ ప్లస్ పేరుకు మోడల్ నంబర్ XT2321 ఇస్తారట. అంటే మొబైల్ పేరు రేజర్ ప్లస్ మోనిక్ XT2321గా ఉండనుంది. మోటోరోలా రేజర్ 2022కు అడ్వాన్స్‌గా రేపర్ ప్లస్ మొబైల్ ఉండనుంది. 8జీబీ ర్యామ్, 128 స్టోరెజ్ సామర్థ్యం గల మొబైల్ భారత మార్కెట్లలో రూ.70,750గా ఉండనుంది. ఈ మొబైల్ 2.7 కవర్ డిస్ ప్లేతో మొబైల్ రానుంది. బ్యాటరీ సామర్థ్యం 2850గా ఉంది. 30 వాట్స్ ఫాస్ట్ చార్జీంగ్ ఇచ్చారు.
ఇక మోటో రేజర్ 2022 (Motorola Razr) ఫీచర్స్ పరిశీలిస్తే.. మోటో రేజర్ 6.7 ఇంచుల ఫోల్డబుల్ ఒలెడ్ మెయిన్ డిస్ ప్లే.. 2.7 ఇంచుల ఒలెడ్ ఔటర్ కవర్ డిస్ ప్లే ఇచ్చారు. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జన్ 1 ఎస్వోసీ ఇచ్చారు. 12 జీబీ ర్యామ్ ఉంది. డ్యుయల్ కెమెరా ఉంది. 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్, 13 మెగా పిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉంది. 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెల్పీల కోసం ఉంది. బ్యాటరీ సామర్థ్యం 3500 ఎంఎహెచ్ ఇచ్చారు. ఇదీ కూడా 33 వాట్స్ ఫాస్ట్ చార్జీంగ్ అవుతుంది.