BHPL: కాటారం మండలం దేవరాంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. భూతగాదాలతో అన్నపై తమ్ముడి కుటుంబీకులు దాడిచేసి, గొడ్డలితో నరికి హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సారయ్య(55) తన కొడుకుతో కలిసి బైక్పై వెళుతుండగా తమ్ముడి కుటుంబ సభ్యులు గొడ్డలితో నరికి చంపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.