»Bhatti Vikramarka Has Promise To Who Dont Have Land
Bhatti vikramarka హామీ.. భూమిలేని వారికి కూడా డబ్బులు
Bhatti vikramarka:కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సహా భట్టి విక్రమార్క (Bhatti vikramarka) కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. యాత్రలో భాగంగా పేదలపై భట్టి (bhatti) విక్రమార్క వరాలు కురిపించారు.
Bhatti vikramarka has promise to who don't have land
Bhatti vikramarka:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడింది. మరో ఐదారు నెలల్లో ఎన్నికల జరగున్నాయి. ప్రధాన పార్టీ నేతలంతా పాదయాత్రల బాట పట్టారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సహా భట్టి విక్రమార్క (Bhatti vikramarka) కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. యాత్రలో (yatra) జనంతో మమేకం అవుతూ.. వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. యాత్రలో పేదలపై భట్టి (bhatti) వరాలు కురిపించారు.
ఆదిలాబాద్ (adilabad) జిల్లాలో భట్టి (bhatti) పాదయాత్ర చేస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే భూమిలేని పేదలకు డబ్బులు అందజేస్తామని పేర్కొన్నారు. రైతుబంధు (Rythy bandu) మాదిరిగా నగదు ఇస్తామని చెప్పారు.. కానీ ఎంత మొత్తమో చెప్పలేదు. భూమి లేని పేదలకు తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. కౌలు రైతులకు కూడా రైతుబంధు అమలు చేసే అంశంపై చర్చిస్తామని.. వారికి రైతుబంధు వేస్తామని చెబుతున్నారు.
రేవంత్ రెడ్డి (revanth reddy) కూడా పాదయాత్ర చేపడుతోన్న సంగతి తెలిసిందే. అధికారమే లక్ష్యంగా నేతలు (leaders) ప్రజల్లోకి (people) వెళుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ (trs) మాత్రం సంక్షేమ పథకాలే తమకు అండగా ఉంటాయని అంటున్నాయి. ఇటీవల జరిగిన టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్ (paper leak) అంశం మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. సకాలంలోనే పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ఈ రోజు ప్రకటన చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం ప్రవేశపెట్టింది. ఏటా పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.5 వేల చొప్పున వారి ఖాతాల్లో జమచేస్తారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఆదర్శంగా తీసుకుంది. కిసాన్ సమ్మాన్ యోజన పథకం ప్రవేశపెట్టింది. భూమి ఉన్న ప్రతీ ఒక్కరికీ ఏడాదికి రూ.6 వేల చొప్పున నగదు వేస్తోంది.