E.G: మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. అమలాపురం దేవాదాయ ధర్మాదాయ శాఖ తనిఖీదారు రామలింగేశ్వరరావు, ఆలయ ఈవో సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో లెక్కింపు జరిగింది. 42 రోజులకు హుండీల ద్వారా 33 లక్షల 35 వేల 485 రూపాయలు ఆదాయం వచ్చిందని 20 గ్రాములు బంగారం, 120 గ్రాములు వెండిని భక్తులు హుండీలో కానుకలుగ సమర్పించారు.