»Varun Gandhi Declines Oxford Union Invite To Speak On If Modis India Is On Right Path
Varun Gandhi: ఆ అంశంపై ఆక్స్ఫర్డ్లో మాట్లాడేందుకు తిరస్కరించిన వరుణ్ గాంధీ
వివిధ సందర్భాలలో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే లేదా విమర్శించే భారతీయ జనతా పార్టీ ఎంపీ (Bharatiya Janata Party MP) వరుణ్ గాంధీ (Varun gandhi).. ఇంగ్లాండ్ లోని ఆక్స్ ఫర్డ్ లో 'మోడీ భారత్ సరైన మార్గంలో వెళ్తుందని విశ్వసిస్తున్నారా' అనే చర్చా వేదికకు రావాలని కోరగా నిరాకరించినట్లుగా తెలుస్తోంది.
వివిధ సందర్భాలలో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే లేదా విమర్శించే భారతీయ జనతా పార్టీ ఎంపీ (Bharatiya Janata Party MP) వరుణ్ గాంధీ (Varun gandhi).. ఇంగ్లాండ్ లోని ఆక్స్ ఫర్డ్ లో ‘మోడీ భారత్ సరైన మార్గంలో వెళ్తుందని విశ్వసిస్తున్నారా’ అనే చర్చా వేదికకు రావాలని కోరగా నిరాకరించినట్లుగా తెలుస్తోంది. ఆక్స్ ఫర్డ్ యూనియన్ ఆయనకు ఇన్విటేషన్ పంపించింది. కానీ నిరాకరించారట. అంతర్జాతీయ వేదిక పైన దేశీయ సవాళ్లను వినిపించడంలో తనకు ఆసక్తి లేదని చెప్పారు. అలా చేస్తే సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అదే వేదిక పైన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రజాస్వామ్య భారతాన్ని అవమానించేలా మాట్లాడారని ఎక్కువ మంది భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ నేలపై భారత్ ను అవమానించడం ఏమిటని దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ సోదరుడు వరుణ్ గాంధీ ఇదే వేదిక పై నుండి మాట్లాడేందుకు నిరాకరించడం గమనార్హం. వరుణ్ కు వచ్చిన ఆహ్వానం షెడ్యూల్ ఏప్రిల్, జూన్ లలో ఉంది. ఆక్స్ పర్డ్ యూనియన్స్ ప్రెసిడెంట్ మాథ్యూ డిక్ తరఫున ఈ బీజేపీ ఎంపీకి ఆహ్వానం అందింది.