మధ్యప్రదేశ్‌లోని భోపాల్, ఉజ్జయినిలో 5 వేల మందికి పైగా భక్తులు భగవద్గీత పారాయణం చేశారు. అంతర్జాతీయ గీతా మహోత్సవంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఆ రాష్ట్ర CM మోహన్ యాదవ్‌కు గిన్నిస్ సంస్థ ప్రతినిధులు రికార్డును అందజేశారు. ఈ సందర్భంగా CM మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో చాలామంది భక్తులు పాల్గొన్నారని, గిన్నిస్‌లో చోటు దక్కడం చాలా సంతషంగా ఉందని చెప్పారు.