PDPL: ధర్మారంలోని అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గోపూజ, సుదర్శన హోమం, శత కలశాభిషేకం, అష్టాభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చిన అనంతరం ఆలయంలో పడిపూజ నిర్వహించారు. తర్వాత అగ్నిగుండాల ప్రవేశం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.