»Central Banking Journal Cbj Said Shaktikanta Das As Governor Of The Year 2023
Shaktikanta Das:’గవర్నర్ ఆఫ్ ది ఇయర్’2023గా శక్తికాంత దాస్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్(Shaktikanta Das) సరికొత్త ఘనతను సాధించారు. 2023 సంవత్సరానికి గాను 'గవర్నర్ ఆఫ్ ది ఇయర్' 2023(Governor of the Year 2023) బిరుదును దక్కించుకున్నారు. సెంట్రల్ బ్యాంకింగ్, అంతర్జాతీయ ఆర్థిక పరిశోధన జర్నల్ CBJ ఈ మేరకు అవార్దును ప్రదానం చేసింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్(Shaktikanta Das) అరుదైన గౌరవం దక్కించుకున్నారు. సెంట్రల్ బ్యాంకింగ్ జర్నల్ (CBJ) “గవర్నర్ ఆఫ్ ది ఇయర్” గా దాస్ ను ఎంపిక చేసింది. క్లిష్టమైన సంస్కరణలను సుస్థిరం చేయడం, ప్రపంచంలోని ప్రముఖ చెల్లింపుల ఆవిష్కరణలను పర్యవేక్షించడం సహా కష్ట సమయాల్లో భారతదేశాన్ని స్థిరమైన విధానంలో నడిపించినందుకు గాను ఈ బిరుదు ఆయనకు దక్కింది. భారతీయ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఈ అవార్డును అందుకోవడం ఇది రెండోసారి. గతంలో 2015లో రఘురామ్ రాజన్ విజేతగా నిలిచారు.
ఈ క్రమంలో కోవిడ్ సంక్షోభ కాలంలో(covid time) దేశ ఆర్థిక వ్యవస్థను(indian economy) నిర్వహించడంలో దాస్ గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని CBJ తెలిపింది. ఓవైపు భయం, మరోవైపు తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు, ఆర్థిక విపత్తుల మధ్య ఆర్బిఐని నేర్పుగా నడిపించారని పేర్కొంది. ఇంకోవైపు ఉక్రెయిన్‌పై(russia ukraine war) రష్యా దండయాత్ర కారణంగా ద్రవ్యోల్బణ ప్రభావాల వంటి క్లిష్ట సమయాల్లో కూడా అతను తిరుగులేని నాయకత్వ ప్రతిభను చూపించాడని జర్నల్ వెల్లడించింది.
ద్రవ్యోల్బణం(inflation) అంచనాలు సెంట్రల్ బ్యాంక్ లక్ష్యం సహా టాప్-ఎండ్‌లో స్థిరపడకుండా చూసేందుకు ద్రవ్య విధాన కమిటీ కొంత సమయం వరకు విశ్రాంతి తీసుకోలేదని జర్నల్ CBJ చెప్పింది. దీంతోపాటు కరోనా కాలంలో(corona time) బ్యాడ్ లోన్స్ పెరుగుదల కార్యరూపం దాల్చలేదన్నారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనూ లేనంత వేగంగా రికవరీని భారతదేశం చేయగలిగిందని జర్నల్ వెల్లడించింది.
మహమ్మారి సమయంలో కీలకమైన సంస్కరణలు, వినూత్న చెల్లింపు వ్యవస్థలు, వృద్ధి ఆధారిత చర్యలను అమలు చేయడంలో RBIలో దాస్ నాయకత్వం కీలకపాత్ర పోషించింది. అనుకూలమైన ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాలతో కీలకమైన రంగాలు, విదేశీ మారకం, రాష్ట్ర ప్రభుత్వాలకు ద్రవ్యత్వం విషయంలో అండగా నిలిచాయని గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలో నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఉక్రెయిన్‌కు(ukraine) కూడా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఏదేమైనప్పటికీ, సంక్షోభ సమయంలో దాస్(Shaktikanta Das) నాయకత్వం, భారతదేశ ఆర్థిక సంస్కరణలకు ఆయన అందించిన గణనీయమైన కృషిని దృష్టిలో ఉంచుకుని అతన్ని గౌరవనీయమైన గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు అర్హులుగా ప్రకటిస్తున్నట్లుగా సీబీజే తెలిపింది.