GNTR: తెనాలిలో 100శాతం చెత్త సేకరణకు ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్తున్నామని కమిషనర్ శేషన్న అన్నారు. తెనాలి పట్టణ 16వ వార్డు నుండి 23వ వార్డు వరకు మంగళవారం ఇంటింటికి చెత్త సేకరణ జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో శానిటేషన్ రోజూరోజుకి మెరుగుపడుతుందని అన్నారు. ప్రతిరోజు 100శాతం చెత్త సేకరణ లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు.