KKD: తాళ్లరేవు మండలం మట్లపాలెం సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడకు చెందిన సీహెచ్ అరవింద్ ద్విచక్ర వాహనంపై యానాం వెళుతున్నాడు. మట్లపాలెం లేఅవుట్ వద్ద ఎదురుగా వస్తున్న ఆటో అతడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. కోరంగి ఎస్ఐ సత్యనారాయణ రెడ్డి అతడిని చికిత్స కోసం కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు