కడప: ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలతో కడప నగరం, శివార్లలో కడప కమాండ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. బ్లూకోల్ట్స్, స్పెషల్ పార్టీ సిబ్బందితో వాహనాల తనిఖీలు, నైట్ పెట్రోలింగ్ చేశారు. వాహనదారులు తమ వెంట వాహనపత్రాలను ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో రిమ్స్ ఇన్స్పెక్టర్ సీతారామి రెడ్డి, సుభాష్ పాల్గొన్నారు.