కడప: జమ్మలమడుగు, మైలవరం ప్రభుత్వ ఐటిఐలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ నవరూప్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 8వ తరగతి పాస్ 10 తరగతి ఫెయిల్ అయినా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈనెల 24వ తేదీలోగా ఆన్లైన్ లేదా కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.