నెల్లూరు జిల్లాలో 7.87లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో చాలా మందికి ఉచిత సిలిండర్లు ఇస్తున్నారు. మార్చి 30వ తేదీ వరకు మొదటి సిలిండర్ బుక్ చేసుకున్న వారికి ఖాతాలో నగదు జమచేశారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రెండో ఉచిత సిలిండర్ బుకింగ్ మొదలు కాగా.. ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. సిలిండర్ డెలివరీ చేసిన రెండు రోజుల్లోనే లబ్ధిదారుల అకౌంట్లో నగదు జమచేస్తోంది.