BPT: మార్టూరు జాతీయ రహదారిపై రెస్ట్ ఏరియా వద్ద శుక్రవారం వేకువ జామున ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న 38 మంది ప్రయాణికుల్లో 18 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108, హైవే అంబులెన్స్‌ల ద్వారా మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.