KDP: కాశినాయన మండలంలో గురువారం భారీ ఈదురు గాలులు బీభత్సం సృష్టించింది. గ్రామాలలో పెద్ద పెద్ద వృక్షాలు, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఆరు కాలం కుటుంబం మొత్తం శ్రమించి, చేతికంది వచ్చిన అరటి తోటలు నేలమట్టం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతులు కోరారు.