»Big Relief In The High Court For The President Of The Employees Union Suryanarayana
Govt Employees Union : ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణకు,(KR Suryanarayana) ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరు ఇవాళ మరో మలుపు తిరిగింది. ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు సూర్యనారాయణ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు (High Court) ఆదేశించింది. ఉద్యోగుల బకాయిలకు సంబంధించి ఇటీవల చర్చలు జరిపిన మంత్రివర్గ ఉప సంఘం.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ఆహ్వానించలేదు. దీనిపై ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణకు,(KR Suryanarayana) ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరు ఇవాళ మరో మలుపు తిరిగింది. ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు సూర్యనారాయణ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు (High Court) ఆదేశించింది. ఉద్యోగుల బకాయిలకు సంబంధించి ఇటీవల చర్చలు జరిపిన మంత్రివర్గ ఉప సంఘం.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ఆహ్వానించలేదు. దీనిపై ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉద్యోగులతో చర్చలకు ప్రభుత్వం తమను ఆహ్వానించడం లేదని, పిలిచే విధంగా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. సూర్యనారాయణ వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. సమావేశాలకు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని(Government Employees Union) ఆహ్వానించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ గవర్నర్ను(Governor) కలిసినప్పటి నుంచి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై రాష్ట్రప్రభుత్వం (State Govt) గుర్రుగా ఉంది. సంఘాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసులు ఇచ్చింది. అయితే, దీనిపై సూర్యనారాయణ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై నిర్లక్ష్యం వహించడాన్ని తప్పుబడుతున్న సూర్యనారాయణ గతంలో గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయడంతో సమస్య మొదలైంది. ఆ తర్వాత ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చల్లో ఆయన్ను ఆహ్వానించడం లేదు. దీనిపై సూర్యనారాయణ హైకోర్టును ఆశ్రయించి ఊరట పొందారు.ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో చర్చల్లో తమను పిలువకపోవడంపై హైకోర్టులో పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ.. తాజాగా ఉద్యోగ సంఘాలతో జరిపిన మంత్రుల కమిటీ సమావేశానికి ఏపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ఆహ్వానించలేదని కోర్టుకు తెలిపారు. దీనిపై హైకోర్టు (High Court) విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం అది అధికారిక సమావేశం కాదని కోర్టుకు తెలిపింది. అయితే ప్రభుత్వ న్యాయవాది (Government Advocate) వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.