HYD: మారేడుపల్లిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం, తిరుమలగిరిలోని నాగదేవత ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజల్లో కంటోన్మెంట్ MLA శ్రీగణేశ్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చింతనతో ప్రతి ఒక్కరికి మానసిక ప్రశాంతత లభిస్తుందని, దైవం ఆశీస్సులతో నియోజకవర్గం ప్రజలు సంతోషంగా ఉండాలని తెలిపారు.