NDL: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఆలయ ప్రాంగణంలోని కుమార స్వామి ఉపాలయంలో శనివారం షష్ఠి తిధి సందర్భంగా అర్చకులు విశేష క్రతువులను నిర్వహించారు. ఈ ఉత్సవంలో భాగంగా కుమారస్వామికి అభిషేకం, సుబ్రహ్మణ్య, అష్టోత్తర చేసిన అనంతరం స్తోత్రపారాయణాలు చేశారు. స్వామివారికి పంచామృతాలు, వివిధ పండ్ల రసాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించారు.