విజయవాడ ఇంద్రకీలాద్రి పై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కేంద్రమంత్రి సురేశ్ గోపి శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ ఈఓ కేఎస్ రామరావు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ వేదపండితులచే వేదాశీర్వచనం చేశారు.