»Telangana Inter First Year Exams From March 15th Today Students No Entry Even If It Is A Minute Late
Telangana Inter Exams: నేటి నుంచే ఇంటర్ ఎగ్జామ్స్..నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
తెలంగాణలో నేటి నుంచి (మార్చి 15) ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు(telangana Inter first year exams) ప్రారంభం కానున్నాయిు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 3 గంటల పాటు జరగనున్నాయి. రేపటి నుంచి ఇంటర్ రెండో ఏడాది ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు(students) పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యం(minute late) అయినా కూడా విద్యార్థులకు అనుమతి లేదని ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు.
తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు(telangana Inter first year exams) మొదలు కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు 180 నిమిషాలు (3 గంటలు) ఉంటాయి. ఇక ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం ఎగ్జామ్స్ మార్చి 16 నుంచి జరగనున్నాయి. ఇప్పటికే అధికారులు ఆయా ఎగ్జామ్స్ సెంటర్ల వద్ద ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు పరీక్షకు విద్యార్థులు(students) నిమిషం ఆలస్యమైనా(minute late) కూడా అనుమతించబోమని వెల్లడించారు. ఈ క్రమంలో ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్య మాత్రమే పరీక్షకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు.
ఎగ్జామ్ హాల్లో ముందుగా ఓఎంఆర్(OMR) షీట్ ఇవ్వగానే విద్యార్థులు(students) వారి పేరు సహా ఇతర అంశాలు కరెక్టుగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని అధికారులు(officers) సూచించారు. ఆ తర్వాత జవాబు పత్రం(answer sheet) ఇచ్చిన తర్వాత 24 పేజీలు ఉన్నాయో లేదో కూడా చెక్(check) చేసుకోవాలని.. లేకపోతే జవాబు పత్రం వెంటనే తిరిగి ఇవ్వాలని వెల్లడించారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగి విద్యార్థులు నష్టపోయిన అంశాన్ని కూడా అధికారులు గుర్తు చేశారు.
ఈ క్రమంలో విద్యార్థులు(students) ఒత్తిడి, భయాందోళన లేకుండా పరీక్షలు రాయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(sabitha indra reddy) విద్యార్థులకు సూచించారు. దీంతోపాటు విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షకు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 9,47,699 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. గత రెండేళ్లుగా కరోనా(corona) కారణంగా 70 శాతం సిలబస్ తో ఎగ్జామ్స్ నిర్వహించగా..ఈసారి మాత్రం 100 శాతం సిలబస్ తో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
పరీక్షలు వరుసగా ఎనిమిది రోజుల పాటు కొనసాగి ఏప్రిల్ 4న ముగుస్తాయి. షెడ్యూల్ ప్రకారం TS ఇంటర్ ప్రథమ సంవత్సరం బోర్డ్ పరీక్షలు 15 మార్చి 2023 నుంచి ఏప్రిల్ 3, 2023 వరకు కొనసాగనున్నాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి.