H3N2 Virus:కరోనా వైరస్ తర్వాత ఇప్పుడు హెచ్3ఎన్2 వైరస్ (H3N2 Virus) కూడా అదేవిధంగా భయపెడుతుంది. ఈ వైరస్ లక్షణాలు (sympotms) కూడా సేమ్ ఉండటం.. వేసవిలోనే వెలుగులోకి రావడంతో భయాందోళనకు కారణమవుతోంది. మరణాలు కూడా సంభవించడంతో అప్రమత్తంగా ఉండాలని ఐసీఎంఆర్ (icmr) తెలుగు రాష్ట్రాలను అలర్ట్ చేసింది.

హెచ్3ఎన్2 కేసులు (H3N2 Virus) అన్ని రాష్ట్రాల్లో వెలుగు చూస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు ఉన్నాయని.. తెలంగాణ (telangana), ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) రాష్ట్రాలను ఐసీఎమ్ఆర్ (icmr) అప్రమత్తం చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో సభలు, సమావేశాలు జరుగుతుండటం ఓ కారణం అని చెబుతోంది. దీంతోపాటు వైద్యం కోసం విదేశీయులు (foreigners) ఇక్కడికి వస్తుండటం మరో రీజన్ అవుతుంది. దీంతో వైరస్ వేగంగా వ్యాపించేందుకు కారణం అవుతున్నాయని చెబుతున్నాయి. దీనికితోడు ప్రజలు మాస్క్ (no mask) ధరించడం లేదని వెల్లడించాయి.
కరోనా కేసులు తగ్గిన తర్వాత భారత్‌లో హెచ్3ఎన్2 వైరస్ (H3N2 Virus) బారిన పడేవారి సంఖ్య ఎక్కువ అవుతుంది. సాధారణ జలుబు (flu), ఫ్లూ జ్వరంలా (fever) లైట్ తీసుకుంటున్నారు. ఈ వైరస్ (virus) దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీచేసింది.
తెలంగాణ (telangana) రాష్ట్రంలో కేసులు పెరగడంతో వైద్య నిర్ధారణ పరీక్షలు చేయాలని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తోంది. ఇమ్యూనిటీతో వైరస్ (virus) నియంత్రించొచ్చు అని కొందరు వైద్యులు (doctors) చెబుతున్నారు. టెస్టుల కోసం బ్లడ్ శాంపిల్ (blood sample) ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌కు పంపిస్తున్నట్టు తెలుస్తోంది. కేసులు పెరిగితే ఫీవర్ ఆస్పత్రితో (fever hospital) వరంగల్ (warangal), ఆదిలాబాద్ (adilabad) జిల్లాల్లో సెంటర్లు నెలకొల్పుతామని ఫీవర్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.