»Ys Viveka Case Fourth Time Ys Avinash Reddy Appears For Cbi Investigation
YS Viveka Case అవినాశ్ ను వదలని సీబీఐ.. నాలుగోసారి విచారణ
సుదీర్ఘ సమయం పాటు విచారణ చేసే అవకాశం ఉంది. కాగా ఈ విచారణ.. గతంలో చేసిన విచారణ అంశాలను సీబీఐ బేరీజు వేసుకోనుంది. అనంతరం అవసరమైతే మరోసారి అవినాశ్ రెడ్డిని హాజరు కావాలని నోటీసులు అందించే అవకాశం ఉంది.
బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో సీబీఐ (Central Bureau of Investigation -CBI) విచారణను వేగవంతం చేసింది. ఈ హత్య కేసులో అనుమానితులను విచారణ చేపడుతోంది. విచారణలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి (YS Avinash Reddy) నాలుగోసారి (Fourth Time) విచారణ (Investigation)కు హాజరయ్యాడు. అయితే ఈసారి తన న్యాయవాది (Lawyer)తో కలిసి విచారణకు రావడం గమనార్హం. ఎస్పీ రాంసింగ్ (SP RamSingh) నేతృత్వంలోని బృందం అతడిని విచారణ చేస్తోంది. ఇప్పటికే చాలా మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సీబీఐ ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ ను మాత్రం తరచూ విచారణకు పిలుస్తున్నది.
ఈ క్రమంలోనే మంగళవారం విచారణకు హాజరయ్యాడు. అయితే ఈ హత్య కేసులో తప్పించుకునేందుకు ఏపీ అధికార పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే లేనిపోని కథనాలను అవినాశ్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు అల్లుతున్నారు. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు తీవ్రమవుతున్నాయి. అయితే దీనికి తెలంగాణ హైకోర్టు (High Court of Telangana) అనుమతించడం లేదు. ఈ క్రమంలోనే తనకు విచారణ నుంచి హాజరుకాకుండా మినహాయించాలని అవినాశ్ రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. కాగా తాజాగా విచారణలో పలు ప్రశ్నలు అవినాశ్ రెడ్డి ఎదుర్కొన్నాడు. సుదీర్ఘ సమయం పాటు విచారణ చేసే అవకాశం ఉంది. కాగా ఈ విచారణ.. గతంలో చేసిన విచారణ అంశాలను సీబీఐ బేరీజు వేసుకోనుంది. అనంతరం అవసరమైతే మరోసారి అవినాశ్ రెడ్డిని హాజరు కావాలని నోటీసులు అందించే అవకాశం ఉంది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల (Parliament Budget Session)ను సాకుగా చూపుతూ విచారణ నుంచి వైదొలుగాలని అవినాశ్ రెడ్డి పన్నిన కుట్ర ఫలించలేదు. అయితే ఆయనకు ఊరట లభించే విషయమేమిటంటే తీర్పు వెలువరించేదాకా అతడిని అరెస్ట్ చేయొద్దని మాత్రం తెలిపింది. తొలిసారి జనవరి 28న, రెండోసారి ఫిబ్రవరి 24న విచారణను ఎదుర్కొన్న అవినాశ్ రెడ్డి ముచ్చటగా మూడోసారి మార్చి 10న సీబీఐ ఎదుట హాజరయ్యాడు. తాజాగా మార్చి 14న మంగళవారం అవినాశ్ సీబీఐ ముందుకు వచ్చాడు. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో అధికారుల అతడిని విచారిస్తున్నారు. కాగా ఈ కేసు నుంచి బయటపడే మార్గాలు లేక విలవిలలాడుతున్నట్లు తెలుస్తోంది.