బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రభాస్ సరసన సాహోలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. అయితే ఈ అమ్మడుని పుష్ప-2 స్పెషల్ సాంగ్ కోసం అనుకున్నారట. కానీ అధిక రెమ్యునరేషన్ అడగడంతో వెనక్కి తగ్గారట. తాజాగా నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్గా తీసుకోవాలని చూశారట. కానీ తన రెమ్యునరేషన్ చూసిన నిర్మాతలు వెనుదిరిగినట్లు టాక్ వినిపిస్తోంది.