AP: కాకినాడ పోర్టు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్లో 41.12 శాతం వాటాను అరబిందో దౌర్జన్యంగా దక్కించుకుందని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్(సీఐడీ)కి ఫిర్యాదు అందింది. ఈ మేరకు కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ ఛైర్మన్ కేవీ రావు సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్కు ఫిర్యాదు చేశారు.