E.G: కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ, అన్నదానం కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. కార్తీకమాసం నెల రోజుల పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్విరామంగా బ్రహ్మాండమైన అన్నసమారాధన ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.