AP: శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యే వాహనం ఢీకొని ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన ఇచ్చాపురం మండలంలోని కొఠారి గ్రామంలో చోటుచేసుకుంది. ఓ ఫంక్షన్కు ఎమ్మెల్యే అశోక్ వెళ్లి వస్తుండగా వృద్ధుడిని కారు ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావటంతో వృద్ధుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. మృతుడు మతిస్థిమితం లేని వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.