woman misbehave man : అబ్బాయిని చెప్పుతో కొట్టిన యువతి…ఆపినా ఆగకుండా..
ఇన్ స్టా గ్రాం(Instagram)లో ఓ యువతిని వేధించిన క్రమంలో ఆగ్రహం చెందిన ఆమె ఓ యువకుడిని చెప్పుతో కొట్టింది. ఈ సంఘటన ఏపీలోని నెల్లూరు జిల్లా కావలి(kavali)లో చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వివరాలెంటో ఓసారి చూసేయండి మరి.
ప్రస్తుత కాలంలో యువతీ, యువకులు ఎక్కువగా సోషల్ మీడియా(social media)లోనే గడుపుతున్నారు. పలు రకాల యాప్స్ ఉపెన్ చేసి వాటిలో అనేక మందితో చాటింగ్ చేస్తూ రకరకాలుగా మేసేజులు చేస్తున్నారు. ఫోన్లు పట్టుకుని గంటల కొద్ది సమయం వృథా చేస్తున్నారు. మరికొంత మంది యువకులు అయితే వారి కోరికలు అదుపు చేసుకోలేక పోర్న్ సైట్స్ చూడటం సహా మహిళలతో అసభ్యంగా చాటింగ్ చేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ ఉర్ఫీ జావెద్ సైతం ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ వ్యక్తి తనకు వాట్సాప్, ఇన్ స్టాలో అసభ్యకరంగా మేసెజులు పంపుతున్నట్లు ముంబయి పోలీసులకు తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు(police) అతన్ని అరెస్టు చేశారు. అంతేకాదు అతను తన లాగే అనేక మంది యువతులు, మహిళలను వేధించినట్లు విచారణలో తేలింది.
అసలు ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా(social media) ద్వారా సమయం వృథా చేస్తున్న యువత తప్పుదారి పట్టారని అనుకోవాలో లేదా ఇంటర్నెట్కు బానిస అయ్యారని అనుకోవాలో అర్థం కావడం లేదు. ప్రతి రోజు ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టా గ్రాం(instagram) సహా పలు అకౌంట్ల ద్వారా మహిళలకు రిక్వెస్ట్ పెట్టడం. వారు యాక్సెప్ట్ చేయగానే నెమ్మదిగా చాటింగ్ చేస్తూ పలువురు యువతుల ఫోటోలు సేకరిస్తారు. ఆ తర్వాత నగ్న పోటోలకు వారి ముఖాలని అమర్చి యువతులను బెదిరించి లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి.
అయితే తాజాగా ఏపీ(ap)లోని నెల్లూరు జిల్లా(nellore district) కావలి(kavali )లో కూడా ఇన్ స్టాలో ఓ యువతి(women)ని వేధించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అనేక రోజుల క్రితం ఓ యువతిని ఇన్ స్టా గ్రామ్ కల్యాణ్ అనే యువకుడు పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత క్రమంగా చాటింగ్(chatting) చేయడం ప్రారంభించాడు. ఇక ఆమె కూడా నెమ్మదిగా చాట్ చేస్తూ ఉండేది. కానీ కొన్ని రోజుల నుంచి ఆమెతో అతను అసభ్యకరంగా చాట్ చేయడం మొదలు పెట్టాడు. దీంతోపాటు కొన్ని చిత్రవిచిత్రమైన ఫొటోలు కూడా ఆమెకు పంపించాడు.
దీంతో ఆవేదన చెందిన మహిళ అతని అడ్రస్(address) కోసం ఆరా తీసింది. అతను అక్కడే స్థానికంగా ఓ టీ షాపులో పని చేస్తాడని తెలుసుకుని అతని దగ్గరకు వచ్చింది. ఆ క్రమంలో అసభ్యకరంగా ఎందుకు మేసేజులు పంపిస్తున్నావని నిలదీసింది. అంతటితో ఆగలేదు. నడిరోడ్డు మీదనే అందరి ముందు ఆ యువకుడిని చెప్పుతో కొట్టి దేహశుద్ది చేసింది. ఏమనుకోని చాట్ చేశావంటూ ఒకటే కొట్టుడు కొట్టింది. ఇది చూసిన పలువురు ఆమెను ఆపే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె మాత్రం అతడిని తీవ్రంగా చెప్పుతో కొట్టేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
అయితే ఈ సోషల్ మీడియా(social media)ను పలువురు యువతీ, యువకులు సక్రమంగా వినియోగిస్తుండగా ఎక్కువ మంది మాత్రం దుర్వినియోగానికి పాల్పడుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ తెలియని వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు(police) సూచిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులతో చాటింగ్(chatting) చేయడం లేదా వారితో వ్యక్తిగత ఫొటోలు గాని, సమాచారం గాని పంచుకోకూడదని పోలీసులు కోరుతున్నారు.