AP: తిరుమలలో స్థానికుల దర్శన టోకెన్ల జారీని టీటీడీ ఛైర్మన్ బీఆర్.నాయుడు ప్రారంభించారు. స్థానికులకు దర్శన విధానం పునరుద్ధరణ చేస్తూ తాజాగా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రతినెలా మొదటి మంగళవారం స్థానికులకు దర్శన అవకాశం కల్పించనుంది. ఈ మేరకు బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్లో భక్తులకు శ్రీవారి దర్శన టోకెన్లు అందించారు.