VSP: బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు వైభవంగా సోమవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ జ్యోతిని వెలిగించి ఉత్సవాలు ప్రారంభించారు. అనంతరం తొలి పూజ నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.