MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాతకు సోమవారం అర్చకులు శంకర్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందువాసరే పురస్కరించుకొని ఆలయ ఆచార సాంప్రదాయ పద్ధతిన అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో వేదోక్తంగా అభిషేకం పూజలు చేపట్టారు. అనంతరం మహా మంగళహారతి నిరాజనం నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు.