GDWL: ఇటిక్యాల మండలం బీచుపల్లి కృష్ణా నది తీరాన వెలసిన అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం అమావాస్య ను పురస్కరించుకొని అర్చకులు స్వామికి అభిషేకం, అర్చన, ఆకు పూజ హోమం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గద్వాల, వనపర్తి జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.