»Shah Rukh Khan Jawaan Movie Scene Leaked Viral On Social Media
Shah Rukh Khan: జవాన్ సీన్ లీక్…నెట్టింట్ వైరల్!
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటిస్తున్న 'జవాన్'లోని యాక్షన్ సీక్వెన్స్ ఆన్లైన్లో లీక్ అయి సోషల్ మీడియా(social media)లో దుమారం రేపుతోంది. దాదాపు ఐదు నుంచి ఆరు సెకన్ల నిడివి గల చిన్న క్లిప్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. 'పఠాన్' స్టార్ పొట్టి జుట్టుతో నోటిలో సిగార్ పట్టుకుని గూండాలను బెల్ట్‌తో కొడుతున్న వీడియో స్లో మోషన్లో కనిపిస్తుంది. ఇది చూసిన అభిమానులు సూపర్ అని కామెంట్లు(comments) చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అందేటీ పఠాన్ మూవీ వచ్చి చాలా రోజులు అవుతుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే షారుఖ్ యాక్ట్ చేస్తున్న తర్వాతి చిత్రం జవాన్(Jawaan movie) నుంచి తాజాగా ఓ సీన్ లీక్ అయిన(Scene Leaked) వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో షారూఖ్ ఖాన్ నీలిరంగు ప్యాంటు, నీలిరంగు చొక్కా ధరించి ఫైట్ చేస్తుండటం చూడవచ్చు. అయితే జవాన్ దృశ్యం సోషల్ మీడియాలో లీక్ అయిన వెంటనే, కాపీరైట్‌ను ఉల్లంఘించినందున సోషల్ మీడియా అకౌంట్ల నుంచి తొలగించారు. మరోవైపు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న రెడ్ చిల్లీస్ సైతం ఈ సన్నివేశాన్ని పంచుకున్నందుకు ట్విట్టర్ వినియోగదారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. SRK అభిమానులు వీడియోను తొలగించాలని, మళ్లీ షేర్ చేయవద్దని సూచించారు.
ఇక ఈ వీడియో చూసిన అభిమానులు పఠాన్ తర్వాత షారుఖ్ ఇందులో అంతకు మించి కనిపిస్తున్నారని అంటున్నారు. బాప్ రే బాప్. బాక్సాఫీస్ కింగ్ షారూఖ్ ఖాన్ (Jawaan) వీడియో లీక్ చేయబడింది. క్యా బాప్ లెవెల్ కి మూవీ లా రహే హో (అన్ని సినిమాలకు ఇది పెద్ద నాన్న)!!! వేచి ఉండలేను. ఇది ఖచ్చితంగా ప్రతి రికార్డును బ్రేక్ చేస్తుందని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. మరో SRK అభిమాని “పఠాన్ కేవలం టీజర్…అట్లీ మాస్ యాక్షన్ పిక్చర్ తో మునుపెన్నడూ లేని విధంగా కనిపిస్తున్నాడని చెప్పుకొచ్చాడు.
దీంతో జవాన్’లోని యాక్షన్ సీక్వెన్స్ ఆన్లైన్లో లీక్ అయి ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో దుమారం రేపుతోంది. దాదాపు ఐదు నుంచి ఆరు సెకన్ల నిడివి గల చిన్న క్లిప్ నెట్టింట చక్కర్లు కోడుతుంది. ‘పఠాన్’ స్టార్ పొట్టి జుట్టుతో నోటిలో సిగార్ పట్టుకుని గూండాలను బెల్ట్‌తో కొడుతున్న వీడియో స్లో మోషన్లో కనిపిస్తుంది. షారుఖ్ ఖాన్‌ను యాక్షన్ సీన్లలో చూసిన అభిమానులకు మరింత కావాలని అంటున్నారు.
కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ(Atlee).. ‘జవాన్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో నయనతార(nayanthara) హీరోయిన్గా నటిస్తోంది. అలాగే ఇళయదళపతి(ilayathalapathy) విజయ్ కూడా కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో బన్నీ(allu Arjun) కూడా భాగమవుతున్నాడని సమాచారం. జవాన్‌లో ఒక ముఖ్యమైన పాత్ర కోసం బన్నీని సంప్రదించాడట అట్లీ. పాత్ర నచ్చడంతో అల్లు అర్జున్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచేసినట్టు టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.