NDL: యాగంటి పుణ్యక్షేత్రంలో అర్ధనారీశ్వరునిగా వెలసిన శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి విశేష ద్రవ్య పూజలను నిర్వహించారు. ఆదివారం అమావాస్య కావడంతో అర్చకులు వేదమంత్రాలతో స్వామివారికి పంచామృత, విశేష ద్రవ్య ఏకవార రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. స్వామివారికి వివిధ రకాల హారతులను నిర్వహించారు. యాగంటి బసవన్నకు విశేష పూజలను నిర్వహించారు.