గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కుతోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. వచ్చే ఏడాది జనవరి 10న విడుదలవుతుంది. అయితే తాజాగా ఈ సినిమా పార్ట్ 2 ఉండబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా అనుకున్న దానికంటే చాలా ఆలస్యంగా వస్తోంది. అలాగే ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తి కాకుండా నెమ్మదిగా జరుగుతుండటంతో ఈ చర్చ మొదలైంది. ఇక ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు.