MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల దేవాలయంలో వన దుర్గా భవాని మాతకు ఆదివారం వేకువజాము నుండి అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తుల ఇలవేల్పు భవాని మాతకు ప్రత్యేక అలంకరణలతో విశేష అభిషేక పూజలు చేశారు. అనంతరం మంగళ హారతి, దీపం, గుగ్గిల ధూపం, నారికేళ, ఫల నైవేద్యం నివేదన చేశారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.