»One Month Ago Hari Hara Said To Niharike About Naveen Murder
Naveenను చంపుతానని హరిహర నెలకిందే చెప్పాడు, పోలీసుల విచారణలో నిహారిక
Naveen:బీటెక్ స్టూడెంట్ నవీన్ (Naveen) హత్య కేసు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. పోలీసుల విచారణలో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. నిహారిక (niharika) ఈ రోజు పలు కీలక అంశాలను తెలిపింది. హరి హర (hari hara) తాను లవ్ (love)లో ఉన్నామని చెబుతూనే.. నవీన్ (Naveen) హత్య గురించి ప్రస్తావించింది.
One month ago hari hara said to niharike about naveen murder
Naveen:బీటెక్ స్టూడెంట్ నవీన్ (Naveen) హత్య కేసు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. పోలీసుల విచారణలో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. అసలు ఏం జరిగిందనే అంశానికి సంబంధించి హరిహర కృష్ణ (hari hara krishna) ఇంచు పొల్లుబోకుండా నిన్న చెప్పిన సంగతి తెలిసిందే. నిహారిక (niharika) ఈ రోజు పలు కీలక అంశాలను తెలిపింది. హరి హర (hari hara) తాను లవ్ (love)లో ఉన్నామని చెబుతూనే.. నవీన్ (Naveen) హత్య గురించి ప్రస్తావించింది. హరి హర తాను ఇద్దరం మాట్లాడుకుంటామని.. తమ ప్రేమ గురించి అతను నవీన్‌కు (Naveen) చెప్పాడని పేర్కొంది.
తమ మధ్య నవీన్ (Naveen) గురించి ప్రస్తావన వచ్చేదని నిహారిక (niharika) తెలిపింది. నవీన్ తనకు ఫోన్ (call), మేసెజ్ (message) చేసే అంశం టాపిక్ తీశానని విచారణలో పేర్కొంది. నెలక్రితమే నవీన్‌ను (Naveen) చంపుతానని హరి హర (hari hara) తనతో చెప్పాడని వివరించింది. అందుకోసమే కత్తి, గ్లౌజులు కొనుగోలు చేశానని చెప్పాడని తెలిపింది. తాను కొప్పాడితే.. సరదాగా అన్నానని చెప్పాడని.. ఆ విషయాన్ని తాను కూడా సీరియస్‌గా తీసుకోలేదని చెప్పింది. ఫిబ్రవరి 17వ తేదీన తనతో నవీన్ (Naveen) మాట్లాడనని.. ఆ తర్వాత హత్య చేశాడని అంటోంది.
ఆ మరునాడు తనను వనస్థలిపురంలో (vanastalipuram) హరిహర (hari hara) తనను కలిశాడని.. రూ.1500 ఇస్తే వరంగల్ (warangal) వెళ్లాడని నిహారిక (niharika) వివరించారు. నిన్న హరిహర (hari hara) మాత్రం 2 నెలల క్రితమే కత్తి, గ్లౌజు కొనుగోలు చేశానని పోలీసులకు చెప్పాడు. 3 నెలల నుంచి నవీన్‌ను (Naveen) హత్య చేసేందుకు వెయిట్ చేస్తున్నానని వివరించాడు. ఇప్పుడు నిహారిక (niharika) మాత్రం నెల క్రితమే తనతో చెప్పాడని అంటోంది. వీరిద్దరీ మాటల్లో పొంతన లేదు. అలాగే.. నవీన్‌ను (Naveen) హరిహర (hari hara) ఒక్కడే చంపాడనే అంశంపై పోలీసులకు సందేహాం ఉంది. హరిహర ఫ్రెండ్ హసన్ (hasan) పాత్ర.? దాంతోపాటు నిన్న పోలీసులకు చెప్పిన జీవన్ (jeevan) పాత్రపై కూడా అనుమానం ఉంది.
నవీన్ (Naveen) హత్య కేసు విచారణ జరగుతుంది. డెప్త్‌గా విచారిస్తే.. అసలు ఏం జరిగిందో తెలిసే ఆస్కారం ఉంది. నవీన్ (Naveen) పేరంట్స్కు మాత్రం కడుపుకోత మిగిలింది. నిందితులను కఠినంగా శిక్షించాలని నవీన్ (Naveen) తండ్రి శంకర్ (shankar) ఇదివరకు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.