BRS BJP Competitive initiations:ఢిల్లీలో బీఆర్ఎస్- బీజేపీ పోటా పోటీ దీక్షలు
BRS BJP Competitive initiations:మహిళా రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి ఫౌండర్ కల్వకుంట్ల కవిత (kavitha) కదం తొక్కారు. ఢిల్లీ నడిబొడ్డున జంతర్ మంతర్ (jantar mantar) వద్ద దీక్షకు దిగారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు మొదలైన దీక్ష సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆమె కోరుతున్నారు.
BRS BJP Competitive initiations:మహిళా రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి ఫౌండర్ కల్వకుంట్ల కవిత (kavitha) కదం తొక్కారు. ఢిల్లీ నడిబొడ్డున జంతర్ మంతర్ (jantar mantar) వద్ద దీక్షకు దిగారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు మొదలైన దీక్ష సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆమె కోరుతున్నారు. కవిత (kavitha) దీక్షకు 18 ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఆ పార్టీ ప్రతినిధులు దీక్ష వద్ద ఆశీనులు కానున్నారు. వివిధ మహిళ హక్కుల సంఘాలు కూడా కవిత (kavitha) దీక్షకు సంఘీభావం తెలుపుతారు. ఉదయం 10 గంటలకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి (sitaram yechury) దీక్షను ప్రారంభించి.. మాట్లాడారు. సాయంత్రం 4 గంటలకు సీపీఐ కార్యదర్శి డీ రాజా (D RAJA) దీక్షకు ముగింపు ఉపన్యాసం ఇస్తారు.
మరోవైపు బీజేపీ నేతలు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు (Delhi liquor scam) వ్యతిరేకంగా దీక్ష చేపట్టారు. తొలుత జంతర్ మంతర్ (jantar mantar) వద్ద దీక్ష చేపట్టాలని అనుకున్నా.. కవిత తలొగ్గకపోవడంతో తమ వేదికను దీన్ దయాల్ మార్గ్‌కు (deen dayal marg) మార్చుకున్నారు. లిక్కర్ స్కామ్‌లో (liquor scam) కవితను (kavitha) రేపు ఢిల్లీలో ఈడీ అధికారులు విచారించనున్న సంగతి తెలిసిందే. నిన్ననే ఆమెను ప్రశ్నించాల్సి ఉన్న.. ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయని లేఖ రాయడంతో ఈడీ అంగీకరించింది. శనివారం ఈడీ అధికారులు విచారిస్తారు.
ఇటు హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో బీజేపీ (bjp) నేతలు ‘మహిళ గోస-బీజేపీ భరోసా’ (mahila gosa- bjp bharosa) పేరుతో దీక్షకు దిగారు. నాంపల్లిలో గల రాష్ట్ర కార్యాలయంలో దీక్షకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay), మహిళా నేతలు డీకే అరుణ (dk aruna), విజయశాంతి (vijayashanti) పాల్గొంటారు. రాష్ట్రంలో పెరిగిన బెల్ట్ షాపులకు నిరసనగా దీక్షకు దిగారు. కేసీఆర్ పాలనలో మహిళలకు అన్యాయం జరుగుతుందన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత (Kavitha) మెడకు చుట్టు బిగుస్తోంది. ఇప్పటికే ఆమె మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును (gorantla buchibabu) అరెస్ట్ చేశారు. తీహార్ జైలు నుంచి ఇటీవలే షరతులతో కూడిన బెయిల్ మీద బయటకు వచ్చారు. మరో అనుచరుడు రామచంద్రా పిళ్లైను (ramachandra) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతను కవిత ప్రతినిధిని అని ఈడీ అధికారులకు (rd officials) చెప్పారట. దీంతో లిక్కర్ స్కామ్‌లో కవిత (Kavitha) అరెస్ట్ తప్పదని తెలుస్తోంది. రేపు ఈడీ విచారణకు కవిత హాజరవుతారు.