క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్ కప్ వచ్చేస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ వరల్డ్ కప్ కి సంబంధించిన మొదటి మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా ఈ వరల్డ్ కప్ ఆతిథ్యం ఇస్తోంది. కరోనా కారణంగా గతంలో జరగకపోగా.. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఈ సమరం జరుగుతుండటం గమనార్హం.
రెండేళ్ల గ్యాప్ తో ఈ మ్యాచ్ జరుగుతుండటంతో… అభిమానులు ఈ మ్యాచ్ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే మ్యాచ్ కి ముందే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడౌతున్నాయి. ఇప్పటికే 6లక్షల టికెట్లు అమ్ముడుపోయాయట.
ఈ వరల్డ్ కప్ కోసం టీమిండియా సహా ఇప్పటికే కొన్ని జట్లు ఆస్ట్రేలియా చేరుకున్నాయి. ప్రాక్టీస్ మ్యాచ్ లతో అక్కడ క్రికెట్ సందడి నెలకొంది.ఈ నెల 16న టీ20 వరల్డ్ కప్ మొదలవనుంది. మొదటగా గ్రూప్ స్టేజ్ మ్యాచులు జరుగుతాయి. గ్రూప్ స్టేజ్ లో శ్రీలంక, నమీబియా, UAE, వెస్టిండీస్, నెదర్లాండ్స్ , స్కాట్లాండ్ , జింబాబ్వే, ఐర్లాండ్ జట్లు పోటీ పడతాయి.
అక్టోబర్ 22 నుంచి సూపర్ 12 రౌండ్ ప్రారంభం అవుతుంది. ఫస్ట్ మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ తో తలపడనుంది. సూపర్ 12లో భాగంగా అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్ తలపడనున్నాయి. మెల్ బోర్న్ లో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ కు సంబంధించి 90 వేల టికెట్లు విక్రయించినట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇవే కాదు.. మిగతా మ్యాచుల టికెట్లన్నీ భారీగానే అమ్ముడయిపోయాయి. గీలాంగ్లోని 36 వేల కెపాసిటీ గల కార్డినియా పార్క్ స్టేడియంలో శ్రీలంక నమీబియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ కు సంబంధించి మాత్రమే టికెట్లు అందుబాటులో ఉన్నాయని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తెలిపింది.