అంత దాక సవ్యంగా సాగే సంసారంలో అత్తాకోడలు కలిస్తే మాత్రం యుద్ధం (War) వచ్చినట్టే. అందుకే ఉమ్మడి కుటుంబాలు అనేవి కనుమరుగవుతున్నాయి. ఒకవేళ అత్తాకోడలు కలిసి ఉంటే మాత్రం ఆ ఇంట్లో నిత్యం గొడవలే. వారిద్దరూ కలిసి ఉన్న ఇంటిలో గొడవలు లేకుంటే వారిని ఆదర్శ అత్తాకోడళ్లుగా అవార్డు ఇవ్వవచ్చు. ఒకరంటే ఒకరికి పడని జీవులు వీరిద్దరూ. చిన్న చిన్న వాటికే పెద్ద గొడవ (Clashes)లకు దారి తీస్తాయి. ఇలానే ఒక చాయ్ (Tea) విషయంలో మొదలైన రాద్ధాంతం ఏకంగా ఒకరి ప్రాణం తీసే స్థాయికి చేరుకుంది. చాయ్ గరం (Hot) లేదని అత్త (Mother-in-Law) దూషించగా.. కోపంతో కోడలు (Sister-in-Law) ఇనుప రాడ్డు తీసుకుని దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేసింది. ఈ దారుణ సంఘటన తమిళనాడు (Tamil Nadu)లో చోటుచేసుకుంది.
పుదుక్కొటై జిల్లా (Pudukkottai District)లోని మలైక్కుడిపట్టిలో వేల్, పళనియమ్మాల్ భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు సుబ్రమణ్యన్ ఉన్నాడు. పిల్లలందరికీ వివాహాలు అయ్యాయి. కుమార్తెలు అత్తింటికి వెళ్లగా.. కొడుకుకు గనుకు అనే అమ్మాయితో వివాహమైంది. భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉండలేక కొడుకు, కోడలితో కలిసి పళనియమ్మాల్ నివసిస్తోంది. కొడుకు సైకిల్ రిపేర్ దుకాణం నడిపిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మార్చి 7వ తేదీ మంగళవారం సాయంత్రం కోడలు గనుకును పిలిచి చాయ్ చేయమని అత్త కోరింది.
ఇష్టం లేక చిరాకుతో కోడలు చాయ్ చేసింది. అయితే చాయ్ చల్లారిపోయాక ఇవ్వడంతో ‘చాయ్ గరం లేదు. ఇట్లేనా ఇచ్చేది’ అని అత్త కోడలిపై కోప్పడింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ చినికి చినికి వానగా మారి ఉప్పెనయ్యింది. ఇద్దరు ఒకరినొకరు తీవ్ర వాగ్వాదం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన కోడలు గనుకు ఇనుప రాడ్ తీసుకుని వచ్చి అత్త తలపై బలంగా బాదింది. పళనిఅమ్మాల్ తీవ్ర గాయాలతో అక్కడే కుప్పకూలింది. సమాచారం అందుకున్న ఆమె కుమారుడు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందింది. ఈ సంఘటనతో స్థానికంగా ఆందోళన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే కోడలు గనుకు మానసిక సమస్యతో బాధపడుతున్నట్టు సమాచారం. ఆమెకు మతిస్థిమితం సరిగ్గా లేదని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది తెలుస్తున్నది. పోలీసులు కేసు నమోదు చేసుకుని కోడలిని అరెస్ట్ చేశారు. క్షణికావేశంలో ఒక నిండు ప్రాణం పోయింది. కోపతాపాలు పక్కనపెట్టి ప్రశాంతంగా ఉంటే అందరి ఇళ్లల్లో కాపురాలు సవ్యంగా సాగుతాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.