రాజమౌళి-మహేష్ బాబు సినిమా గురించి ఎన్నో పుకార్లు షికార్లు చేస్తునే ఉన్నాయి. ఇంకా స్క్రిప్టు కూడా ఫైనల్ కాలేదు.. అప్పుడే స్టార్ క్యాస్టింగ్ తైరపైకొస్తుంది. అలాంటి వార్తల్లో ఎంతవరకు నిజముందనే విషయాన్ని పక్కన పెడితే.. ఈ పుకార్లు మాత్రం ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నాయి. దాంతో మరోసారి రాజమౌళి, మహేష్ విలన్ గురించి చర్చ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న-మహేష్ కాంబో ఫిక్స్ అనే సంగతి తెలిసిందే.
అలాగే రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పిన ప్రకారం.. ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో ఉంటుందని తెలుసు. ఇక ఇటీవల ఈ ప్రాజెక్ట్ ‘గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్’ అని చెప్పుకొచ్చాడు రాజమౌళి.. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. ఇవి తప్పితే ఎస్ఎస్ఎంబీ29 గురించి అఫీషియల్ అప్టేట్స్ ఏమిలేవు. కానీ ఏదో ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తునే ఉంది. చాలా రోజులుగా ఈ సినిమాలో ఓ హీరోని విలన్‌గా తీసుకకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
లేటెస్ట్గా స్క్రిప్టు ఫైనల్ స్టేజ్‌లో ఉందని.. దాంతో కొంతమంది ఆర్టిస్టులను ఫైనల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట రాజమౌళి. మామూలుగా రాజమౌళి సినిమాల్లో హీరోల కంటే విలన్లే పవర్‌ఫుల్‌గా ఉంటారు. అలా అయితేనే హీరోయిజం ఎలివేట్ అవుతుంది. ఈ క్రమంలో మహేష్ కోసం కోలీవుడ్ స్టార్ హీరో కార్తిని.. విలన్ పాత్ర కోసం సంప్రదించే ఆలోచనలో ఉన్నారట. మరో వెర్షన్ ప్రకారం.. ఇప్పటికే కార్తీతో జక్కన్న టీమ్ టచ్‌లో ఉందని టాక్. అయితే ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ఈ సారి మాత్రం రాజమౌళి.. విలన్‌గా ఓ స్టార్ హీరోని తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీ టాక్.